మలికిపురం మండలం దిండి గ్రామంలో నూతన సురక్షిత తాగునీటి ట్యాంక్ నిర్మాణానికి రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ నుంచి మంజూరైన ఈసీ ఫండ్స్ ద్వారా రూ. 43. 10 లక్షలతో ట్యాంక్ నిర్మాణం చేపట్టామని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.