మలికిపురం మండలం కత్తిమండకు చెందిన ఏసుబాబు (32) శనివారం దిండి-చించినాడ వారధిపై నుంచి గోదావరిలోకి దూకి గల్లంతయ్యాడు. అతని ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. గల్ఫ్ లో జీవనం సాగించే ఏసుబాబు ఇటీవలే స్వదేశం వచ్చాడు. గజ ఈతగాళ్ల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ ఆదివారం కూడా అతని ఆచూకీ లభించలేదు.