పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను విజయవాడ ఆంధ్ర రతన్ భవన్లో శుక్రవారం మలికిపురం మండలం లక్కవరం గ్రామానికి చెందిన పీసీసీ సభ్యులు రుద్రరాజు గోపాలకృష్ణరాజు మర్యాద పూర్వకంగా కలిశారు. ఆమెకు బొకే అందించి శుభాకాంక్షలు తెలిపారు. పీసీసీ అధ్యక్షురాలిగా షర్మిల బాధ్యతలు చేపట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతంమైందన్నారు. పార్టీని బలోపేతం చేసేందుకు సమిష్టిగా ముందుకు సాగాలని సూచించారన్నారు.