రాజోలు నియోజకవర్గంలో రూ. కోట్లు ఖర్చు చేసి గ్రామ పంచాయతీలో నిర్మించిన చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలు నిరుపయోగంగా మారాయి. దీంతో ఎక్కడ చూసినా చెత్త, ప్లాస్టిక్, గాజుసీసాలు పేరుకుపోతున్నాయి. నియోజకవర్గంలోని 59 గ్రామాలలో మలికిపురంలో 15, రాజోలులో 12 సఖినేటిపల్లిలో 14 సంపద తయారీ కేంద్రాలు ఉన్నాయి. వాటిలో కేవలం నాలుగైదు తప్ప మిగతా కేంద్రాలు యార్డులు వినియోగంలోకి రావడం లేదని ప్రజలు గురువారం చెప్పారు.