రాజోలు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నూతనంగా నిర్మించిన బాలుర టాయిలెట్స్ ను కళాశాల ఛైర్మన్ జొన్నలగడ్డ గోపాలకృష్ణ శుక్రవారం ప్రారంభించారు. బహిరంగ మూత్ర విసర్జనను ప్రభుత్వం నిషేధించిందని, విద్యార్థులు విధిగా మరుగుదొడ్లను వాడాలని గోపాలకృష్ణ సూచించారు. దీంతో పాటు వాటిని పరిశుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత కూడా విద్యార్థులపై ఉందన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ పి. సాయిబాబు పాల్గొన్నారు.