రాజోలు నియోజకవర్గం పరిధిలోని మండలాలకు చెందిన దివ్యాంగులకు ఉపకరణాలను పంపిణీ చేసేందుకు రాజోలు మండలంలోని శివకోటిలో మంగేన గంగయ్య కళ్యాణ మండపం వద్ద అధికారులు గుర్తింపు శిబిరాన్ని బుధవారం ఏర్పాటు చేశారు. ఈ శిబిరానికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారు వీల్ చైర్లు, వినికిడి యంత్రాలు, ఇతర ఉపకరణాల కోసం వారి అర్హతలకు సంబంధించిన పత్రాలను అధికారులకు అందజేశారు.