రాజోలు మండల ప్రజా పరిషత్ నూతన మండలం పరిషత్ అభివృద్ధి అధికారిగా డి. రాంబాబు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఆయనకు ఏవో సత్యనారాయణ, కార్యాలయ సిబ్బంది పుష్పగుచ్ఛం ఇచ్చి ఘన స్వాగతం పలికారు. ఇప్పటి వరకు ఇక్కడ బాధ్యతలు నిర్వహించిన బాలాజీ బదిలీపై మలికిపురం ఎంపీడీవోగా వెళ్లడంతో ఆ స్థానంలో రాంబాబు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. అందరి సహకారంతో మండల అభివృద్ధికి కృషి చేస్తానన్నారు.