భారీ వర్షాలు, గోదావరికి వరద పెరుగుతుండటంతో అమలాపురం ఆర్డీవో జి. కేశవర్ధన రెడ్డి వివిధ శాఖల అధికారులతో కలిసి గత నవంబరులో స్లాబు కొంతమేర కుంగిపోయిన వాడబోది స్లూయిస్ ను, సమీపంలోని బచ్చలబంద, గోగన్నమఠం పరిధిలోని కడలి అవుట్ఫాల్ స్లూయిస్ లను బుధవారం పరిశీలించారు. తహసీల్దారు మృత్యుంజయరావు, వీఆర్వోలు పాల్గొన్నారు.