సఖినేటిపల్లి మండలం చింతలమోరి, కేశవదాసుపాలెం, అంతర్వేదికర, అంతర్వేది గ్రామాల్లో నిలిచి పోయిన ముంపు నీటిని సముద్రంలోకి మళ్లించేందుకు చర్యలు తీసుకుంటామని రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ తెలిపారు. ఆయన ఆదివారం ముంపు నీరు నిలిచిన గ్రామాల్లో పర్యటించారు. ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాల వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు. డ్రెయిన్ల అక్రమణ కూడిక తీయకపోవడం వంటి కారణాలతో సమస్య జటిలంగా మారిందన్నారు.