టిడిపి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

515చూసినవారు
టిడిపి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
తెలుగుదేశం పార్టీ 42వ వ్యవస్థాపక దినోత్సవం తుని మండలం తేటగుంట పార్టీ కార్యాలయంలో ఘనంగా శుక్రవారం జరిగింది. తుని నియోజవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి యనమల దివ్య హాజరై ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి మిఠాయిలు పంచారు. ఈ సందర్భంగా యనమల దివ్య మాట్లాడుతూ తెలుగువాడి ఆత్మగౌరవం కాపాడేందుకు స్వర్గీయ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారని ఆమె అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్