Jan 22, 2025, 14:01 IST/మక్తల్
మక్తల్
అమరచింత: నూతన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంజూరు చేస్తాం
Jan 22, 2025, 14:01 IST
అమరచింత మండల కేంద్రానికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంజూరు చేస్తామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ హామీ ఇచ్చారు. బుధవారం సాయంత్రం ఆరోగ్య ఉప కేంద్రాన్ని సందర్శించారు. రికార్డులను పరిశీలించి రోగులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్య సిబ్బందికి సూచించారు. ఆరోగ్య ఉప కేంద్రాన్ని ప్రైమరీ హెల్త్ సెంటర్ గా మారుస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు శ్రీహరి, మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు.