ఆలమూరు: మహిళ ఆత్మహత్యాయత్నం... రక్షించిన యువకులు
డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం జొన్నాడ గౌతమి కొత్త బ్రిడ్జి పై నుండి ఆదివారం మధ్యాహ్నం గోదావరిలోకి దూకి మహిళ ఆత్మహత్యాయత్నం చేయగా, స్థానిక యువకులు జాలరి సహాయంతో రక్షించి ఆసుపత్రికి తరలించారు. స్థానికుల కథనం ప్రకారం పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ మండలం నడిపూడికి చెందిన మహిళగా గుర్తించారు. ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.