మామిడికుదురు: అంబులెన్స్ లో ప్రసవం.. తల్లి బిడ్డ క్షేమం
మామిడికుదురు మండలం గోగన్నమఠానికి చెందిన చందన అనే గర్భిణీ పురిటి నొప్పులతో బాధపడుతుంది. ఈ మేరకు ఆమెను 108 అంబులెన్స్ లో శనివారం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలోనే నొప్పులు అధికమవ్వడంతో అంబులెన్స్ ఉద్యోగులు ప్రియదర్శిని, పైలెట్ రవి ఆమె కుటుంబ సభ్యుల సహాయంతో చాకచక్యంగా డెలివరీ చేశారు. తల్లి, బిడ్డను సురక్షితంగా సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. పలువురు సిబ్బందిని అభినందించారు.