పెద్దాపురం ఎక్సైజ్ పరిధిలో 411 దరఖాస్తులు
పెద్దాపురం ఎక్సైజ్ సర్కిల్ పరిధిలో 19 మద్యం షాపులకు సంబంధించి శుక్రవారం రాత్రి వరకు 411 దరఖాస్తులు అందాయని ఎక్సైజ్ సీఐ దుర్గా అర్జున్ తెలిపారు. దరఖాస్తుల స్వీకరణ ముగిసిందని, పెద్దాపురం మున్సిపాలిటీలో 6 షాపులకు 118, పెద్దాపురం రూరల్లో 5 షాపులకు 78, గండేపల్లి మండలంలో 3 షాపులకు 53, జగ్గంపేట మండలంలో 5 షాపులకు 162 దరఖాస్తులు వచ్చాయని అన్నారు. సీఐతో ఎక్సైజ్ ఎస్ఐ చిట్టిబాబు ఉన్నారు.