మన్మోహన్‌ను అవమానించడం చరిత్రలో మాయని మచ్చ: స్టాలిన్‌

78చూసినవారు
మన్మోహన్‌ను అవమానించడం చరిత్రలో మాయని మచ్చ: స్టాలిన్‌
మాజీ ప్రధాని డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌ను అవమానించిన మచ్చ చరిత్ర నుంచి మాయదని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ తెలిపారు. మన్మోహన్‌ సింగ్‌కు స్మారకం నిర్మించనున్న ప్రాంతంలో అంత్యక్రియలు నిర్వహించడానికి అనుమతించాలన్న ఆయన కుటుంబ సభ్యుల అభ్యర్థనను భాజపా ప్రభుత్వం నిరాకరించిందన్నారు. ఇది మన్మోహన్‌సింగ్‌ ఉన్నత సేవలను, ఆయన సిక్కు సమాజాన్ని ప్రత్యక్షంగా అవమానించే చర్యగా తెలిపారు. అలాంటి మహోన్నత నాయకుడిని విస్మరించడం భారతదేశ అభివృద్ధిని అవమానించడంతో సమానమన్నారు.

సంబంధిత పోస్ట్