
రాజమండ్రి: రీ సర్వే విధుల్లో నిర్లక్ష్యం.. కలెక్టర్ కొరడా
పనిచేయని ఉద్యోగులపై కలెక్టర్ పి.ప్రశాంతి కొరడా ఝుళిపిం చారు.విధుల్లో నిర్లక్ష్యంగా ఉన్న 26 మంది ఉద్యోగులకు శనివారం షోకాజ్ నోటీసులు జారీ చేశారు.ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు.వీరిలో 12 మంది డిప్యూటీ తహశీల్దార్లు, 12 మంది మండల సర్వేయర్లు, ఇద్దరు గ్రామ సర్వేయర్లు ఉన్నారు. క్షేత్రస్థాయిలో రీసర్వే ప్రకియ్రను నిర్ధిష్టమైన మార్గదర్శకాలు అనుసరించి చేయాలి. కానీ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో వారికి కలెక్టర్ షోకాజ్ నోటీ సులు జారీ చేశారు.