సిపిఎ చైర్ పర్సన్ గా రాజమండ్రి ఎంపీ
బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ (సిపిఎ) ఇండియా రీజియన్ ప్రతినిధిగా కామన్వెల్త్ మహిళా పార్లమెంటరీ స్టీరింగ్ కమిటీ సభ్యురాలిగా నామినేట్ అయ్యారు. ఈ మేరకు లోక్ సభ స్పీకర్ ఓ బిర్లా సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. 2026 చివరి వరకు ఈ నియామకం వర్తిస్తుందని వెల్లడించారు.