రాష్ట్రస్థాయి పోటీల్లో సఖినేటిపల్లి విద్యార్థుల ప్రతిభ
హిందూపురంలో జరిగిన రాష్ట్ర స్థాయి షటిల్ బ్యాడ్మింటన్ పోటీల్లో సఖినేటిపల్లి మండలం మోరి గ్రామానికి చెందిన ముప్పర్తి కృష్ణకార్తీక్ డబుల్స్ ద్వితీయ స్థానం సాధించారు. విశాఖపట్నానికి చెందిన రాహుల్ తో కలిసి కార్తీక్ ఈ పోటీల్లో పాల్గొని ప్రతిభ కనబరిచాడు. ఈ నెల 10 నుంచి 13వ వరకు ఈ పోటీలు జరిగాయి. మలికిపురం బ్యాడ్మింటన్ అకాడమీ సభ్యులు రాంబాబు రాజు, ప్రిన్సిపల్ సతీష్ శనివారం విద్యార్థులను అభినందించారు.