అంతర్వేది నరసింహస్వామి సన్నిధిలో తెలంగాణ ఎన్నికల కమిషనర్

54చూసినవారు
సఖినేటిపల్లి మండలం అంతర్వేదిలో కొలువుదీరిన శ్రీ లక్ష్మీనరసింహస్వామిని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి కుటుంబ సమేతంగా మంగళవారం దర్శించుకున్నారు. ఈ మేరకు వారికి ఆలయ అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేదాశీర్వచనం అందజేశారు. ఆలయ అసిస్టెంట్ కమిషనర్ సత్యనారాయణ వారికి స్వామి చిత్రపటం, ప్రసాదాలు అందజేశారు.

సంబంధిత పోస్ట్