మంచినీటి ట్యాంకును ప్రారంభించిన ఎమ్మెల్యే దివ్య
కాకినాడ జిల్లా తుని ఉప్పరగూడెం ప్రాంతంలో మంచినీటి ట్యాంకును తుని ఎమ్మెల్యే యనమల దివ్య మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వంద రోజుల పరిపాలన అద్భుతంగా జరిగిందని ఎమ్మెల్యే తెలిపారు. అనంతరం ఇది మంచి ప్రభుత్వం అంటూ ప్రత్యేక స్టిక్కర్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటరావు తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.