తుని చేపల మార్కెట్ లో భారీ రొయ్య
కాకినాడ జిల్లా, తుని పట్టణ చేపల మార్కెట్ లో ఆదివారం అతి భారీ రొయ్య ఆదివారం ఆకట్టుకుంది. ఈ ఒక్క రొయ్య బరువు దాదాపు కేజీ పైగా ఉండడం విశేషం. అక్కడున్న చేపల కంటే ఇది పొడవుగా, బరువుగా ఉండడంతో పలువురి చూపు ఈ రొయ్యపై పడింది. దీంతో చేపలు కొనుగోలు చేసేందుకు వచ్చిన ప్రతి ఒక్కరు ఈ రొయ్యను చూస్తూ ఆశ్చర్యానికి లోనయ్యారు. దీన్ని ధర రూ.500 నుంచి రూ.1000 ఉంటుందని వర్తకులు తెలిపారు.