డెంగీ వ్యాధి పట్ల అప్రమత్తం

50చూసినవారు
పరిసరాల పరిశుభ్రతను అందరూ బాధ్యతగా తీసుకోవాలని సానిటరీ ఇన్ స్పెక్టర్ జి శేఖర్ అన్నారు. తుని పట్టణంలోని 20, 21 వార్డుల్లో డెంగీ నివారణపై మంగళవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మున్సిపల్ అధికారులు మాట్లాడుతూ దోమలు కుట్టడం వల్ల డెంగ్యూ జ్వరం వస్తుందన్నారు. ఖాళీ కొబ్బరి బొండాలు, రుబ్బురోలు, ఖాళీ టైర్లు, గుంతలో నీటి నిల్వ లేకుండా జాగ్రత్త తీసుకోవాలి అన్నారు.

సంబంధిత పోస్ట్