వీర్యకణాల సంఖ్య పెరగాలంటే ఇవి తినండి

39928చూసినవారు
వీర్యకణాల సంఖ్య పెరగాలంటే ఇవి తినండి
వీర్యకణాల సంఖ్య తగ్గితే పిల్లలు పుట్టడం కష్టమవుతుంది. కొన్ని ఆహారాలను తింటే వీర్యకణాల సంఖ్య బాగా పెరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. గుడ్డులో ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. అవి వీర్యకణాలు ఆరోగ్యంగా, చురుగ్గా ఉండేందుకు సహాయపడతాయి. పాలకూరలో ఐరన్ కంటెంట్ తో పాటుగా ఫోలిక్ యాసిడ్ కూడా ఉంటుంది. ఈ ఫోలిక్ యాసిడ్ వీర్యకణాల సంఖ్య పెరిగేందుకు, ఎదిగేందుకు సహాయపడుతుంది. అరటిపండ్లు కూడా వీర్యకణాల సంఖ్యను పెంచేందుకు అవి యాక్టీవ్ గా కదిలేందుకు సహాయపడతాయి. వీర్యకణాల సంఖ్య పెరగాలంటే మందును ఎక్కువగా తాగడకూడదు. స్మోకింగ్ మానేయాలి. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుకోవాలి. ఒత్తిడికి గురికాకూడదు.

సంబంధిత పోస్ట్