ఆచంట వేమవరంకు చెందిన బ్యూటీ పార్లర్ నిర్వాహకురాలు వివాహిత షేక్ రజియా (33) మంగళవారం అనుమానాస్పదస్థితిలో ఉరి వేసుకుని మృతి చెందింది. ఆమె మృతదేహాన్ని పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. స్థానిక చాకలి చెరువు ఏరియాలో ఉండే రజియా బ్యూటీ పార్లర్ నిర్వహిస్తుంది. భర్త షేక్ సిలార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆచంట ఎస్ఐ కేసు దర్యాప్తు చేస్తున్నారు.