పశ్చిమగోదావరి జిల్లా పెనుమంట్ర వాటర్ డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్ ఎన్నికలు మంగళవారం జరిగాయి. ఈ ఎన్నికల్లో వెలగల బుల్లిలరామిరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయనను ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ తనయుడు పితాని వెంకట్ అభినందించారు. అలాగే రైతుల సంక్షేమం మరియు అభివృద్ధి కోసం పనిచేయాలని ఆయన ఈ సందర్భంగా సూచించారు.