మోపిదేవిలోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయం భక్తులతో ఆదివారం పోటెత్తింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకునేందుకు విచ్చేశారు. తొలుత నాగ పుట్ట వద్ద పాలు పోసి స్వామివారికి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. పలువురు తమ మొక్కుబడులను చెల్లించుకున్నారు. ఆలయ కార్యనిర్వహణ అధికారి చక్రధర్ రావు ఏర్పాట్లు పర్యవేక్షించారు.