ప్రతిభ కలిగిన విద్యార్థులను ప్రోత్సహించాలని భీమవరం ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు అన్నారు. నూతన సంవత్సరంగా సందర్భంగా ఇద్దరు ప్రతిభ కలిగిన విద్యార్థులను జనసేన 24వ వార్డు ఇన్ ఛార్జ్ యర్రా నాని ఆర్థిక సహకారంతో ₹. 6, 000 ఆర్థిక సహాయాన్ని ఎమ్మెల్యే అంజిబాబు, పార్టీ జిల్లా అధ్యక్షుడు కోటికలపూడి గోవిందరావు చేతుల మీదుగా అందించారు. దాతలు అందిస్తున్న సహాయ సహకారాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.