ప.గో: జిఐ సర్టిఫికెట్ అందుకున్న కలెక్టర్

51చూసినవారు
పశ్చిమగోదావరి జిల్లా లేసు తయారీదారుల కృషి ఫలితంగా నేడు జిఐ సర్టిఫికెట్ ను పొందడం జరిగిందని, ఈ క్రమంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ప్రత్యేక అభినందనలు తెలిపారు.కేంద్ర ప్రభుత్వం జౌళి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో సోమవారం న్యూఢిల్లీలోని హోటల్ ఒబెరాయ్‌లో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ వర్క్‌షాప్‌లో పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పాల్గొని పశ్చిమగోదావరి నరసపురం క్రోచెట్ లేస్ ప్రొడక్ట్స్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ కు కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ చేతులు మీదుగా (జిఐ) సర్టిఫికేట్‌ను అందుకున్నారు.

సంబంధిత పోస్ట్