ఎగువ ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలకు చింతలపూడి మండలం నాగిరెడ్డిగూడెం తమ్మిలేరు జలాశయానికి వరద కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో 3 గేట్లు ఎత్తి 250 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేసినట్లు ఏఈఈ పరమానందం మంగళవారం తెలిపారు. జలాశయంలోకి వచ్చే వరదను బట్టి నీటి విడుదల ఉంటుందని పేర్కొన్నారు. తమ్మిలేరు ఎరీవాహక రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.