చింతలపూడి మండలం పోతునూరు శివారులో సోమవారం తెల్లవారుజామున జరిగిన బస్సు బోల్తా ఘటనలో ఒక మహిళ మృతి చెందగా మరో 15 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సందర్భంగా సిఐ రవీంద్ర వివరాలు వెల్లడించారు. హైదరాబాద్ నుంచి ఏలూరు వెళ్తున్న ఆర్టీసీ బస్సు పోతునూరు శివారు వద్దకు వచ్చేసరికి అదుపుతప్పి బోల్తా కొట్టిందన్నారు. డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని తెలుస్తుందన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశామన్నారు.