చింతలపూడి మండలం ఎండపల్లిలో మోరంపూడి శ్రీనివాసరావు ఆదివారం వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఎస్సై కుటుంబరావు చొరవతో కిందకు దిగాడు. కొంతమంది వేధింపుల వల్ల తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని గ్రామంలో తుమ్మల చెరువు 25 ఎకరాలలో చేపల పెంపకానికి 3 సం. లు లీజుకు తీసుకుంటే గడువు పూర్తైందంటూ చేపలు పట్టకుండా చెరువుని వేలం వేయాలని చూస్తున్నారని ఆరోపించారు.