జంగారెడ్డిగూడెంలో నకిలీ కరెన్సీ చలామణి చేస్తున్న ఐదుగురు వ్యక్తుల్ని పోలీసులు గురువారం అరెస్టు చేశారు. ఈ సందర్భంగా డిఎస్పి రవిచంద్ర మీడియా సమావేశంలో నిర్వహించి వివరాలు వెల్లడించారు. నకిలీ కరెన్సీ చలామణిపై ప్రత్యేక నిఘా పెట్టి ఈ కేసులో ఐదుగురిని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి రూ. 2,50,000 నకిలీ కరెన్సీ, రెండు కార్లు, ఒక ద్విచక్ర వాహనం, రూ. 40వేలు అసలు కరెన్సీ స్వాధీనం చేసుకున్నామన్నారు.