కామవరపుకోటలో బుధవారం వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. దీంతో గ్రామంలో భారీ వర్షం కురిసింది. ఈ నేపథ్యంలో జనజీవనం స్తంభించింది. అదేవిధంగా దీపావళిని పురస్కరించుకొని బాణాసంచా దుకాణాలు ఏర్పాటుచేసిన వ్యాపారస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలాగే వర్షం రాకతో రహదారులపై వర్షపునీరు పొంగిపొర్లుతుంది.