పశ్చిమగోదావరి జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ముదునూరి ప్రసాద్ రాజును నియమిస్తూ ఆ పార్టీ అధిష్టానం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ఆయన గతంలో నరసాపురం మాజీ ఎమ్మెల్యేగా, మాజీ చీఫ్ విప్‌గా పనిచేశారు. ఈ సందర్భంగా ఆయనకు జిల్లాలోని మాజీ ఎమ్మెల్యేలు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు అభినందనలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లాలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని అన్నారు.