దెందులూరులో శ్రీశయన కమ్యూనిటీ హాల్ సమీపంలో తవుడు లోడుతో వెళుతున్న లారీ గురువారం బోల్తా పడింది. తణుకు నుంచి దెందులూరులోని తవుడు పరిశ్రమకు వస్తున్న లారీ రహదారి కుంగడంతో మురుగు కాలువలో బోల్తా పడింది. ఈ ప్రాంతంలో నిత్యం జన సంచారం ఎక్కువగా ఉంటుందని ప్రమాదం జరిగిన సమయంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు.