దెందులూరు మండలం వీరమ్మకుంటలో శుక్రవారం సాయంత్రం బాణా సంచా పేలుడు కలకలం రేపింది. స్థానిక చేపల చెరువు వద్ద నిల్వ ఉంచిన దీపావళి బాణసంచా ప్రమాదవశాత్తు పేలడంతో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో కర్ణకోటి పాల్ బాబు పరిస్థితి విషమించడంతో విజయవాడ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.