గోపాలపురంలో అరుదైన భారీ చేప
గోపాలపురంలో శుక్రవారం భారీ చేప ప్రత్యక్షమైంది. మండల కేంద్రమైన గోపాలపురంలోని ఓ ఫిష్ మార్కెట్లో నెమలి కోనం అనే 150 కేజీల భారీ చేప వైజాగ్ సముద్రపు పోర్ట్ నుంచి గోపాలపురం వ్యాపారస్థులు తీసుకువచ్చారు. దీంతో దానిని చూసేందుకు ఎగబడ్డారు. తమ ఫోన్లలో ఫొటోలు, వీడియోలు తీసుకున్నారు. దాని మాంసంను కేజీ రూ. 500 లకు విక్రయించారు. ముల్లులు ఉండకపోవడం ఈ చేప ప్రత్యేకతని చెప్తున్నారు.