ద్వారకాతిరుమల మండలం ఎం.నాగులపల్లి వద్ద గురువారం వేకువజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో గౌతమ్ అనే యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. మరో నలుగురు గాయపడ్డారు. విజయవాడ నుంచి మారేడుమిల్లి విహారయాత్రకు కారు అద్దెకు తీసుకుని బయలుదేరిన వీరి వాహనం ముందున్న లారీని ఢీకొట్టింది. ఘటనా స్థలం విషాదకరంగా మారింది.గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.