గోపాలపురం: రెవెన్యూ సదస్సులతో భూ సమస్యలు పరిష్కారం

85చూసినవారు
భూ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ సదస్సులు ఎంతగానో ఉపయోగపడతాయని తహశీల్దార్ అజయ్ బాబు అన్నారు. వేళ్లచింతలగూడెంలో రెవెన్యూ సదస్సును గురువారం ప్రారంభించారు. భూ వివాదాలను ఓ కొలిక్కి వచ్చే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. సమస్య పరిష్కారం కోసం ఎలాంటి రుసుము చెల్లించక్కర్లేదన్నారు. ఇది నిరంతర ప్రక్రియని పేర్కొన్నారు. ఇందులో భాగంగా ప్రజల నుంచి అర్జీలను స్వీకరించి, రసీదులను అందజేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్