అధిక కరెంటు ఛార్జీల బాదుడుపై వైసీపీ మాజీ మంత్రి తానేటి వనిత శుక్రవారం గోపాలపురం నియోజకవర్గంలో నిరసన చేపట్టారు. సందర్భంగా ఆమె మాట్లాడుతూ కూటమి అధికారంలో వేల కోట్లు కరెంటు ఛార్జీలపై ప్రజల నుంచి దోచుకుంటున్నారు. ఎన్నికల సమయంలో చెప్పింది ఏంటి, ఇప్పుడు చేసేది ఏంటని ప్రశ్నిస్తూ. వెంటనే ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్నారు. ఈ నిరసనలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.