పెదపాలపర్రు మాజీ హెచ్ఎం జె. శాంతకుమా రిపై ఆర్జేడీ ఆదేశాల మేరకు గురువారం కమిటీ విచారణ నిర్వహించింది. స్థానిక పాఠశాలలో విచారణాధికారి, డీఈవో కార్యాలయ ఏడీ ఎంవీ. అవధాని, నూజి వీడు డీవైఈవో సేవ్యానాయక్, కార్యాలయ సూపరింటెండెంట్లు మోహన్, పవన్ విచారించారు. గతంలో శాంతకుమారిని సస్పెండ్ చేసిన అంశాలపై విచారించారు. పాఠశాల హెచ్ఎం పాండురంగారావు, ఉపాధ్యాయులు, సిబ్బంది చే లిఖితపూర్వకంగా వివరాలు సేకరించారు.