వైద్యురాలు పై హత్యాచారం చేసిన దోషులను కఠినంగా శిక్షించాలనీ గ్రామీణ వైద్యుల కైకలూరు సంఘ నాయకులు డిమాండ్ చేశారు. కోల్ కత్తాలో వైద్యురాలి పై జరిగిన హత్యాచారానికి నిరసనగా శనివారం కైకలూరు లో వారు వైద్య సేవలు నిలిపి నిరసన వ్యక్తం చేశారు. విజయ్ కుమార్ , లంకపల్లి రవి లు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న వైద్యుల నిరసన కార్యక్రమానికి సంఘీ భావంగా నిరసన వ్యక్తం చేయడం జరిగిందని తెలిపారు.