వైభవంగా గ్రామదేవత జాతర

62చూసినవారు
మండవల్లి మండలంలోని ఇంగిలిపాకలంక గ్రామంలో గ్రామదేవత హంగానమ్మ తల్లి జాతర వైభ వంగా నిర్వహించారు. శనివారం అమ్మవారిని నిలిపారు. గ్రామ పెద్దలు జాతర కమిటీవారు గ్రామంలో చలువ పందిర్లు వేశారు. ఉదయం మహిళలు ఊరేగింపు గా బయలుదేరి ఆలయం వద్ద బోనాలు సమర్పించారు. ఈ సందర్భంగా సాయంత్రం అమ్మవారికి పూజా కార్యక్రమాలు నిర్వహించి మొక్కుబడులు చెల్లించి పూజలు చేశారు. అనంతరం గ్రామం లో అమ్మవారిని ఊరేగించారు.

సంబంధిత పోస్ట్