తాడేపల్లిలో సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ
తాడేపల్లి మండలం ఉండవల్లి గ్రామానికి చెందిన జొన్నా హరితకు రూ. 1, 05, 000, విలువైన సీఎం సహాయనిధి చెక్కును టీడీపీ నాయకులు శుక్రవారం అందజేశారు. సీఎం సహాయ నిధికి సిఫార్సు చేసిన మంత్రి నారా లోకేశ్ కు చెక్కు పొందిన హరిత కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర అధికార ప్రతినిధి జానకీదేవి మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల ఆరోగ్యం పట్ల పూర్తి భరోసా కల్పిస్తుందన్నారు.