నేషనల్ ఇన్స్టిట్యూట్ ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్క్ ఎక్స్పర్ట్ కమిటీ ఈ నెల 25, 26 తేదీల్లో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో పర్యటిస్తోందని రిజిస్ట్రార్ ఆచార్య సింహాచలం మంగళవారం తెలిపారు. కమిటీ పర్యటించే రెండు రోజులు బోధన, బోధనేతర సిబ్బంది అందుబాటులో ఉండాలని వెల్లడించారు. కమిటీ అడిగే సమాచారం అందరూ సిద్ధం చేసుకోవాలన్నారు. ఈ రెండు రోజులు సిబ్బంది అనుమతి లేకుండా సెలవులు పెట్టవద్దని సూచించారు.