నరసాపురం నియోజకవర్గం నాగిడిపాలెం బ్రిడ్జి దారితిప్ప లో గల నరసాపురం వ్యవసాయ మార్కెటింగ్ శాఖ చెక్ పోస్ట్ ను మంగళవారం రాత్రి నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా చెక్ పోస్ట్ పని తీరుపై సిబ్బందిని పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. చెక్ పోస్ట్ రికార్డులను పరిశీలించిన ఆయన సిబ్బందికి పలు సూచనలు చేశారు.