మొగల్తూరు మండలం కాళీపట్నం వెస్ట్ గ్రామంలో పశుసంవర్ధక శాఖ మరియు పశుగణాభివృద్ధి సంస్థల ఆధ్వర్యంలో.. సోమవారం ఉచిత పశు గర్భకోశ వ్యాధుల చికిత్స శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నరసాపురం శాసనసభ్యులు బొమ్మిడి నాయకర్ పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం ఇలాంటి శిబిరాల కోసం ఎన్నో నిధులను వెచ్చిస్తోందని కావున పసుపు పోషకులు వీటిని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమానికి కాళీపట్నం వెస్ట్ సర్పంచ్ కౌర్ సావిత్రి ఆదినారాయణ అధ్యక్షత వహించారు.