చాట్రాయి మండలంలోని పోలవరం గ్రామంలో శనివారం ఎన్టీఆర్ వర్ధంతిని టీడీపీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ మండల మాజీ అధ్యక్షులు మరిడి వెంకటేశ్వరరావు ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నందమూరి తారక రామారావు ప్రజలకు చేసిన మేలు మరువలేనిదని అన్నారు.