నూజివీడు పట్టణలోని పొందుల పేటలో కే. ఏసమ్మ(39) ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన జరిగింది. భర్త వెంకటేశ్వరరావు తాపీ పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. భర్త ఇంట్లో నిద్రిస్తుండగానే ఆమె ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లుగా బంధువులు చెప్పుకుంటున్నారు. ఈమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఏసుమ్మ అనుమానాస్పద స్థితిలో మృతి చెందడంపై నూజివీడు పట్టణ విచారణ చేస్తున్నట్లుగా హెడ్ కానిస్టేబుల్ కోటేశ్వరరావు తెలిపారు.