పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ సెంటర్ ఏర్పాటు పనుల్లో నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులను హెచ్చరించారు. ఈ సందర్భంగా మంగళవారం పాలకొల్లు వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేయబోయే డయాలసిస్ సెంటర్ పనులను పరిశీలించడం జరిగింది. అలాగే కొత్త భవన నిర్మాణ పనుల తీరను పరిశీలించారు.